'టాయ్లెట్: ఏక్ ప్రేమ్ కథ' చిత్రంలో భార్యాభర్తలుగా నటించి ఆకట్టుకున్నారు అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్(Bhumi Pednekar). ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి మరో చిత్రంలో నటించడానికి రంగం సిద్ధమైంది. ఆనంద్ ఎల్ రాయ్(Aanand L Rai) దర్శకత్వంలో అక్షయ్ కుమార్ నటిస్తున్న చిత్రం 'రక్షాబంధన్'(Raksha bandhan). ఇందులో అక్షయ్(Akshay Kumar), భూమి నటించనున్నట్లు సమాచారం.
ఈ చిత్రాన్ని ఇదే ఏడాది నవంబరులో విడుదల చేయాలనుకున్నారు. కరోనా ప్రభావంతో ఇప్పటివరకూ ప్రాజెక్టు సెట్స్పైకే వెళ్లలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం చిత్రీకరణలకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఈ నెలలోనే 'రక్షాబంధన్' చిత్రీకరణను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అన్నా చెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే చిత్రమిది.