ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ కిడ్స్ సుహానా ఖాన్, ఖుషీ కపూర్, సారా అలీ ఖాన్ వంటి వారంతా హాట్ హాట్ ఫొటో షూట్‌లతో, తమ ఫ్యాషన్ ట్రెండ్స్‌తో నెట్టింట హల్‌చల్ చేస్తున్నారు. ఆమీర్ ఖాన్ ముద్దుల తనయ ఇరా ఖాన్ మాత్రం వీరందరికీ భిన్నంగా తన ప్రేమ ముచ్చట్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది. కొంత కాలంగా ఈ అమ్మడు మిషాల్ కిర్సాలానీ అనే మ్యూజిక్ కంపోజర్‌తో ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే.
నెట్టింట వైరల్ అవుతోన్న ఆమిర్ తనయ వీడియో - ఆమిర్ ఖాన్ తనయ
ఆమిర్ ఖాన్ ముద్దుల తనయ ఇరా ఖాన్ రొమాంటిక్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రియుడు మిషాల్ కిర్సాలానీతో కలిసి చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఆకర్షిస్తోంది.
వీరిద్దరికీ సంబంధించిన రొమాంటిక్ ఫొటోలు తరచూ ఇన్‌స్టాగ్రామ్ వాల్‌పై సందడి చేస్తూనే ఉంటాయి. అయితే ఇప్పటి వరకు ఫొటోల్లోనే రొమాన్స్ పండించిన ఇరా తాజాగా ఓ రొమాంటిక్ వీడియోతో నెట్టింట సెగలు రేపింది. ప్రస్తుతం ఈ చిన్నది షేర్ చేసిన వీడియోలో ఆమె తన ప్రియుడితో ఫుల్ రొమాంటిక్ మూడ్‌లో స్లో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఇక ఈ క్లిప్పింగ్ చివర్లో మిషాల్.. ఇరాను తన కౌగిలిలో గట్టిగా బంధించిన తీరు వీడియోకే హైలైట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జంట చూడముచ్చటగా ఉందనికొందరుకామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు ఇరా తన తండ్రి పరువును తీస్తోందంటూ విమర్శిస్తున్నారు.
ఇవీ చూడండి.. సాయిపల్లవితో కమ్ముల మరోసారి ఫిదా చేస్తాడా?