రౌడీహీరో విజయ్ దేవరకొండ- దర్శకుడు పూరీ జగన్నాథ్(Vijay Devarkonda-Purijagannadh) కాంబోలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'లైగర్'(Liger). ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా గురించి ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట్లో జోరుగా ప్రచారమవుతోంది.
ఈ సినిమాలో అంతర్జాతీయ దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్(Boxer MikeTison) అతిథి పాత్రలో కనిపించనున్నారంటూ మాట్లాడకుంటుననారు. ఇంతకు ముందే దీని గురించి న్యూస్ వచ్చినప్పటికీ, ఇప్పుడు మరోసారి ఆ విషయం చర్చనీయాంశమైంది. ఇదే కనుక నిజమైతే టైసన్‌ను భారతీయ తెరకు పరిచయం చేసిన తొలి దర్శకుడు పూరీనే అవుతాడు!
టైసన్ ఇప్పటికే పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. అతడి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'టైసన్'తో పాటు 'ద హ్యాంగోవర్', 'చైనా సేల్స్‌మేన్', 'కిక్ బాక్సర్' తదితర సినిమాలతో ఆకట్టుకున్నాడు. భారతీయ సినిమాలపైనా టైసన్‌కు మక్కువ ఎక్కువే. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌తో ఇతడికి మంచి స్నేహబంధం ఉంది. ఈ బాక్సర్ భారత్‌కు ఎప్పుడు వచ్చినా తన రక్షణ బాధ్యతలను సల్మాన్ సిబ్బందికే అప్పగిస్తుంటాడు.
కిక్ బాక్సింగ్ కథతో తీస్తున్న 'లైగర్'లో విజయ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రంతోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. కరణ్‌జోహార్(Karan Johar) నిర్మాత నటి ఛార్మి(charmi) సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్, రిలీజ్ ఆలస్యమయ్యాయి.
ఇదీ చూడండి: కరోనా కారణంగా లైగర్ టీజర్ రిలీజ్ వాయిదా