తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Olympics: పతకం గెలిస్తే జీవితాంతం సినిమా టికెట్స్ ఫ్రీ - Olympics latest news

ప్రముఖ మల్టీప్లెక్స్​ సంస్థ.. ఒలింపిక్స్ అథ్లెట్లకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. పతకం గెలిస్తే జీవితాంతం సినిమా టికెట్లు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.

INOX Offers Free Lifetime Movie Tickets To India's Medal Winners At Tokyo Olympics 2020
ఒలింపిక్స్

By

Published : Jul 28, 2021, 9:31 AM IST

ఒలింపిక్స్​లో(Olympics) భారత అథ్లెట్లు కొందరు తమ ప్రదర్శనతో మెప్పిస్తుండగా.. మరికొందరు నిరాశపరుస్తున్నారు. వెయిట్​లిఫ్టర్ మీరాబాయ్ చాను(Mirabai Chanu).. ఇప్పటికే మహిళల 49 కిలోల విభాగంలో రజతం సాధించగా, ఒలింపిక్స్​లో పాల్గొన్న ఇతర క్రీడాకారులు పతకమే లక్ష్యంగా సత్తా చాటుతున్నారు. అయితే టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొన్న అథ్లెట్లకు ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ ఐనాక్స్(INOX) అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది.

పతకం సాధించిన వారికి తమ మల్టీప్లెక్స్​ల్లో జీవితాంతం ఉచితంగా సినిమాలు చూసే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. పాల్గొన్న వారందరికీ ఏడాది పాటు ఫ్రీగా(Free Tickets) సినిమా టికెట్స్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

.

కరోనా తొలి, రెండో దశ ప్రభావంతో చాలావరకు థియేటర్లు, మల్టీప్లెక్స్​లు మూసివేశారు. ఇటీవలే వైరస్​ ప్రభావం నెమ్మదించిన నేపథ్యంలో తిరిగి తెరిచారు. పలు తెలుగు సినిమాలు కూడా జులై 30 నుంచి థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 'తిమ్మరుసు'(Thimmarusu), 'ఇష్క్'(Ishq).. అదే రోజు నుంచి ప్రేక్షకులను అలరించనున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details