సినిమాలో పాట నచ్చితే ఎక్కువ సార్లు వింటాం... అందులో అర్థం మరీ బాగుంటే కాలర్ ట్యూన్లుగా మార్చుకుంటాం.. కానీ ఓ బాలీవుడ్ సినిమా పాటను పాఠశాల గీతంగా స్వీకరించి విద్యార్ధులతో పాడిస్తున్నారు. అదీ భారత్లో కాదు పాకిస్థాన్లోని ఓ స్కూల్లో.
భారతీయ సినిమా పాట.. పాకిస్థాన్ పాఠశాల గీతం - paistan
1957లో బాలీవుడ్లో వచ్చిన దో ఆంఖే బారహ్ హాథ్ చిత్రంలోని పాటను పాకిస్థాన్లోని ఓ పాఠశాల తమ స్కూల్ గేయంగా స్వీకరించింది. లతా మంగేష్కర్ ఆలపించిన ఆ పాట ఎంతో ప్రాచుర్యం పొందింది.
1957లో వచ్చిన 'దో ఆంఖే బారహ్ హాథ్' చిత్రంలోని యే మాలిక్ తేరే బంద్ హమ్ అనే పాట అప్పట్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. అందులోని భావం నచ్చి పాకిస్థాన్లో ఓ పాఠశాల నిర్వాహకులు తమ పాఠశాల గేయంగా స్వీకరించారు. లతా మంగేష్కర్ ఆ పాటను ఆలపించారు.
ఈ చిత్రం అప్పట్లో బంపర్ హిట్టైంది. ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. బెర్లిన్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో సిల్వర్ బేర్ పురస్కారాన్ని అందుకుంది. జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ ప్రాంతీయ చిత్రం(హిందీ) అవార్డులు దక్కించుకుంది.