Ilayaraja sp balu: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారంటూ గురువారం పలు వార్తలు వచ్చాయి. ఏమైందంటూ ఆయన అభిమానులు కాస్త గందరగోళానికి గురయ్యారు. అవి కేవలం వదంతులేనని, తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానంటూ ఇళయరాజా చెప్పారు. 'ఇలమై ఐతో' సాంగ్ పాడి మరీ తనపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టారు.
అనారోగ్యమని వదంతులు.. పాట పాడి మరీ ఇళయరాజా క్లారిటీ - Ilaiyaraja telugu melody songs
Ilayaraja health: తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను పాట పాడి మరీ చెక్ పెట్టారు మాస్ట్రో ఇళయరాజా. అలానే న్యూ ఇయర్ విషెస్ కూడా చెప్పారు.
ఇళయరాజా
'సకలకళా వల్లవన్' అనే తమిళ సినిమాలోనిది 'ఇలమై ఐతో' పాట. దీనికి ఇళయరాజా సంగీతమందించగా, దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలు అద్భుతంగా ఆలపించారు. తమిళనాడులో ప్రతి న్యూ ఇయర్‌ను ఈ పాటతో చాలా గ్రాండ్‌గా జరుపుకొంటారు. ఈ క్రమంలోనే ఈ పాట పాడిన తనపై వస్తున్న వదంతులను ఇళయరాజా కొట్టిపారేశారు.
ఇవీ చదవండి:
Last Updated : Dec 31, 2021, 4:49 PM IST