దర్శక-నిర్మాత పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా నటిస్తున్న రెండో చిత్రం 'రొమాంటిక్'.తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. టైటిల్‌కు తగ్గట్లుగానే రొమాంటిక్‌గా ఉంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. హీరోహీరోయిన్లు ఇద్దరూ హత్తుకుని ఉన్న ఫోజు అలరిస్తోంది. ఈ సినిమాతో దిల్లీకి చెందిన మోడల్ కేతిక శర్మ కథానాయికగా పరిచయమవుతోంది.
'రొమాంటిక్' ఫస్ట్ లుక్ అంతే రొమాంటిక్‌గా - ketika sharma, akash puri
ఆకాశ్ పూరీ హీరోగా నటిస్తున్న 'రొమాంటిక్' సినిమా ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటోంది. పూరీ జగన్నాథ్.. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించడం విశేషం.
రొమాంటిక్
ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలను అందిస్తూ, ఛార్మితో కలిసి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు పూరీ జగన్నాథ్. అనిల్ పాదూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చూడండి.. 'అవును... ఆ హీరో అంటే నాకు ఇష్టం'
Last Updated : Oct 2, 2019, 1:54 PM IST