తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇకపై సరికొత్త పాత్రలో ఇలియానా! - ఇకపై సరికొత్త పాత్రలో ఇలియానా!

నాయికగా వెండితెరపై విజయవంతమైన ఇలియానా.. ఇకపై సరికొత్త పాత్రలో కనిపించబోతోంది. ఓటీటీ వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైందని సమాచారం. త్వరలో అమెజాన్​ ప్రైమ్​ కోసం ఓ టాక్​ షో చేయనుంది.

Ileana, prepares to do a talk show on the OTT stage
ఇలియానా, ఇకపై సరికొత్త పాత్రలో ఇలియానా!

By

Published : May 7, 2021, 8:05 AM IST

వెండితెరపై జోరు చూపిస్తూనే.. ఓటీటీ వేదికలపైనా సత్తా చాటేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు ఈతరం నాయికలు. ఇప్పటికే కాజల్‌, సమంత, తమన్నా లాంటి వారంతా ఓటీటీల్లోకి అడుగుపెట్టారు. ఇప్పుడీ జాబితాలోకి నాయిక ఇలియానా వచ్చి చేరుతోంది. త్వరలో ఆమె అమెజాన్‌ ప్రైమ్‌ కోసం ఓ టాక్‌ షో చేయనుందని సమాచారం.

ఇదీ చదవండి:ఈసారి మర్డర్ మిస్టరీ వెబ్​ సిరీస్​లో తమన్నా

ఇందుకోసం ఇలియానా భారీ మొత్తంలో పారితోషికం అందుకోనుందని ప్రచారం జరుగుతోంది. దక్షిణాదికి చెందిన ఓ ప్రముఖ దర్శకుడు ఈ షోకి దర్శకత్వం వహించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తొలి సీజన్‌కు దక్కే ఆదరణను బట్టి అమెజాన్‌ ఈ షోని కొనసాగించే ఆలోచన చేయనుంది.

ఇదీ చదవండి:'రంగమ్మత్త'లానే 'పుష్ప'లో పాత్ర కూడా: అనసూయ

ABOUT THE AUTHOR

...view details