అందంతో పాటు అభినయంతో టాలీవుడ్‌తో పాటు దక్షిణాదిన అగ్రతారల్లో ఒకరిగా కొనసాగుతున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. ప్రత్యేకంగా తెలుగు ఇండస్ట్రీలో దాదాపు అందరు అగ్రకథానాయకులతో ఆమె సినిమాలు చేసింది. తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. అయితే.. ఇంత బిజీగా ఉన్న ఆమె సినిమాకు గుడ్ బై చెప్పబోతోందా..? అనే చర్చ కొంతకాలంగా టీటౌన్‌లో జోరుగా సాగుతోంది. ఇంతకీ ఏమైందంటే..
చాలా మంది హీరోయిన్లు పెళ్లయ్యాక దాదాపు సినిమాలకు దూరమవుతూ ఉంటారు. పెళ్లైన తర్వాత సినిమాలు చేసేందుకు మనసు ఒప్పక కొంతమంది.. వ్యక్తిగత కారణాలతో మరి కొంతమంది సినిమాకు వీడ్కోలు చెప్తారు. అయితే.. ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా ఆ జాబితాలో చేరబోతున్నట్లు కనిపిస్తోంది. ఆమె గతేడాది అక్టోబర్ 30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుంది. ఆమె వివాహం తర్వాత సినిమాలు చేస్తుందా? అనే అనుమానం అందరిలోనూ కలిగింది.