దక్షిణాదిలో మరో అగ్ర కథానాయకుడి చిత్రం నేరుగా ఓటీటీ వేదిక ద్వారా విడుదల కాబోతోంది. అదే.. సూర్య హీరోగా నటించిన 'ఆకాశం నీ హద్దురా!' సుధ కొంగర దర్శకత్వం వహించిన చిత్రమిది. దీపావళి సందర్భంగా నవంబరు 12న అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారాచిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా కథానాయకుడు సూర్య, దర్శకురాలు సుధ కొంగర ఆన్‌లైన్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ..
సూర్య ఏమన్నారంటే..
- ''లాక్‌డౌన్‌కి ముందే విడుదల కావాల్సిన సినిమా.. 'ఆకాశం నీ హద్దురా'. కరోనా పరిస్థితుల వల్ల సాధ్యం కాలేదు. అయితే.. ఈ ఆరు నెలల సమయమూ మాకుఉపయోగపడింది. విజువల్ ఎఫెక్ట్స్‌తో చిత్రాన్ని మరింత సహజంగా తీర్చిదిద్దింది మా బృందం. థియేటర్ కోసమే తీసిన సినిమా ఇది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావల్సి వస్తోంది. మా దర్శకురాలు సుధ ఈ విషయంలో అసంతృప్తిగానే ఉన్నారు. కానీ.. నిర్మాతగా, ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరి కోసం ఓటీటీలో విడుదల చేయాలనేనిర్ణయం తీసుకున్నా. ఈ మాధ్యమం ద్వారా ఎక్కువమంది ప్రేక్షకులకు సినిమా చేరువ కానుండడం సంతోషంగా ఉంది. థియేటర్ అనుభూతిని కోల్పోయినా, కుటుంబమంతాకలిసి హాయిగా ఇంట్లో సినిమాని ఆస్వాదించే వీలుకలుగుతుంది''.
- ''ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. ఒకసాధారణ మనిషి, అసాధారణమైన కలల్ని కని సాకారం చేసుకున్న విధానం ఇందులోకనిపిస్తుంది. మనందరం తక్కువ ఖర్చుతో విమానయానం చేస్తున్నామంటే కారణం.. కెప్టెన్ గోపీనాథ్. ఎయిర్ డెక్కన్ అధినేత అయిన ఆయన.. ఒక స్కూల్ మాస్టర్‌అబ్బాయి. ఒక ఎయిర్‌లైన్స్ కంపెనీని స్థాపించిన ఆయన కథే ఈ చిత్రం. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచే కెప్టెన్ గోపీనాథ్ జీవితం ఆధారంగా సినిమాఅన్నప్పుడు ఎలాంటి సందేహాలు కలగలేదు. అయితే విస్తృతమైన ఆయన జీవిత ప్రయాణంలోఏ భాగం ఈ సినిమాలో ఉంటుందో తెలుసుకోవాలనుకున్నా. సుధ కొంగర స్క్రిప్టువినిపించాక ఇంకా సంతృప్తి కలిగింది. సెట్స్‌పైకి వెళ్లడానికి కొన్ని నెలలముందే ఈ చిత్రం కోసం స్క్రిప్ట్ పఠనం చేశాం. ఇది నాకు కొత్త రకమైనఅనుభవం. సుధ ఆలోచనలకి తగ్గట్టుగా ప్రయాణం చేశాం''.
- ''దర్శకురాలు సుధ నాకు ఎప్పట్నుంచో పరిచయం. ‘యువ’ సినిమా చేసేటప్పుడు ఆమెసహాయ దర్శకురాలు. ఒక సన్నివేశంలో నేను బాగా నటించలేదని మొహం మీదేచెప్పేసింది. దర్శకుడు మణి రత్నంకి నచ్చినా, నాతో మళ్లీ చేయించింది. అలా ఆ సినిమా సమయంలో చాలా విషయాల్లో సహాయం చేసింది. ఈ సినిమా విషయంలోనూ ఆమె ఒక డ్రిల్ మాస్టర్‌ని గుర్తు చేశారు. ఏ విషయంలోనూ రాజీ పడకుండా పని చేయించారు. వాస్తవికత ఉట్టిపడేలా ఆమె ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది''.
- ''గజిని', 'సూర్య సన్ ఆఫ్ కృష్ణన్', 'సింగం'... ఇలా పలు సినిమాల్లో చాలా రకమైన గెటప్పుల్లో కనిపించా. ఇందులో నటించడం మాత్రం భిన్నమైన అనుభవాన్నిచ్చింది. నిజజీవితంలో చేసిన పనుల్ని అదే రీతిలో తెరపై కనిపించేలా నటించాల్సి వచ్చింది. కెప్టెన్ గోపీనాథ్ ప్రయాణంలోని లోతుల్ని ఆవిష్కరిస్తూ సాగే కథ ఇది. ఆయన్ని నేను బెంగళూరులోని నివాసంలో కలిసి మాట్లాడా. వ్యక్తిగతంగానూ ఈ సినిమా నన్ను నా పాతరోజుల్లోకి తీసుకెళ్లింది. సొంత ఆదాయం కోసం కష్టపడిన రోజుల్ని మరోసారి గుర్తు చేసింది. ఒక సగటు వ్యక్తిగా, ఎయిర్ ఫోర్స్ కెప్టెన్‌గా, ఎయిర్‌లైన్స్ అధినేతగా ఇలా పలు కోణాల్లో సాగే పాత్రలో కనిపించనున్నా. ఈ కథ విన్నప్పుడు నన్ను ఆసక్తికి గురిచేసిందీ నా పాత్ర స్వభావమే. మోహన్‌బాబు సర్ ఈ సినిమాకి పెద్ద బలం. తన సన్నివేశాలు, తమిళ యాస విషయంలోనూ ఆసక్తిగా అడిగి తెలుసుకునేవారు. ఆయన పాత్ర గుర్తుండిపోతుంది''.
అదే అజెండాతోనే తీశా..