తమిళ కథానాయకుడు విజయ్ నటించిన 'మాస్టర్' సినిమా ఓ మాస్టర్ పీస్ అవుతుందని విజయ్ సేతుపతి తెలిపాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన చిత్రమిది. మాళవికా మోహనన్ కథానాయిక. విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఇందులో తన పాత్ర గురించి తాజా ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి ముచ్చటించాడు. విజయ్‌కు విలన్‌గా నటించిన పాత్రను ఎంజాయ్ చేసినట్లు చెప్పాడు.
"ప్రతి వ్యక్తిలోనూ చెడు ఉంటుంది. దాన్ని తొలగించుకోవడానికి మార్గం ఉందా? లేదా? అనే విషయంపై నాకు స్పష్టత లేదు. కానీ ఓ నటుడు ప్రతినాయకుడిగా చేస్తున్నప్పుడు మాత్రం అతడిలోని చెడ్డ వ్యక్తి బయటికి వస్తాడు. ఇందులో నేను భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌గా నటించా.. ఆ పాత్రను పూర్తిగా ఎంజాయ్ చేశా. విజయ్ హీరోగా, నేను విలన్‌గా నటించడం వల్ల ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టే 'మాస్టర్' చిత్రం అలరిస్తుంది. ఇది ఓ 'మాస్టర్ పీస్' అవుతుంది."