మెగాస్టార్ చిరంజీవితో తనకు మరో సినిమా చేయాలని ఉందని ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ మనసులో మాట బయటపెట్టారు. సామాజిక నేపథ్య కథతో చిత్రం తీస్తే, ఇప్పటి చిరుకు సరిగ్గా సరిపోతుందని అన్నారు. ఆయన కోసం తన దగ్గర భారీ ప్లాన్సే ఉన్నాయని తెలిపారు.
Chiranjeevi: 'చిరంజీవి కోసం నా దగ్గర భారీ ప్లాన్స్' - గుణశేఖర్ సమంత శాకుంతలం
చిరుతో సినిమా చేసేందుకు సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం 'శాకుంతలం'తో బిజీగా ఉన్న ఆయన.. మెగాస్టార్ కోసం కథ సిద్ధం చేస్తున్నారట.
చిరంజీవి
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'చూడాలని ఉంది'.. ప్రేక్షకులను ఆకట్టుకోవడం సహా గుణశేఖర్‌కు చాలా గుర్తింపు తీసుకొచ్చింది. గత కొన్నేళ్లుగా పీరియాడికల్ సినిమాలు చేస్తున్న ఈ డైరెక్టర్.. ప్రస్తుతం ముద్దుగుమ్మ సమంతతో 'శాకుంతలం' తీస్తున్నారు. ఒకవేళ అన్నీ కుదిరితే చిరుతో గుణశేఖర్ త్వరలో కలిసి పనిచేస్తారేమో?
ఇవీ చదవండి: