తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవన్​ కల్యాణ్​​ సినిమాలో విలన్​గా మమ్ముట్టి..! - తాజా తెలుగు సినిమా వార్తలు

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్​ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. మమ్ముట్టిని పవన్​ కల్యాణ్​ చిత్రంలో విలన్​గా నటిస్తారా అని అడిగినట్లు తెలిపాడు. ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం..

i asked to the mammutti will you do as a villian in pawankalyan movie said allu aravind
పవన్​ కల్యాణ్​​ సినిమాలో విలన్​గా మమ్ముట్టి..!

By

Published : Dec 3, 2019, 8:48 PM IST

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించి సినీ ప్రియుల మదిలో మళయాల సూపర్​ స్టార్​గా చెరగని ముద్ర వేశాడు మమ్ముట్టి. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'మాయాంగం'. చారిత్రక కథ నేపథ్యంలో సాగే ఈ సినిమా డిసెంబరు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్​ సంస్థ విడుదల చేయనుంది. తాజాగా సినిమా ట్రైలర్​ విడుదల వేడుకలో మ్ముముట్టి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్​. ఒకసారి మమ్ముట్టికి ఫోన్​ చేసి పవన్​ కల్యాణ్​ చిత్రంలో విలన్​గా నటించమని అడిగినట్లు గుర్తు చేసుకున్నాడు.

పవన్​ కల్యాణ్​​ సినిమాలో విలన్​గా మమ్ముట్టి..!

"స్వాతికిరణం' సినిమా కోసం మమ్ముట్టిని తీసుకున్నప్పుడు.. అదేంటి ఓ మలయాళ నటుడిని తీసుకొస్తున్నారు, తెలుగు ప్రేక్షకులకు ఆయన పాత్ర కనెక్ట్‌ అవుతుందో లేదో అనుకున్నా. నిజానికి అప్పటికి ఆయన అంత పెద్ద నటుడని నాకు తెలియదు. కానీ, ఆ సినిమా థియేటర్లో చూసినప్పుడు కనీసం లేచి నిలబడలేకపోయా. అంత గొప్పగా నటించారాయన. తర్వాత ఓసారి పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన ఓ సినిమాలో ప్రతినాయక పాత్ర కోసం మమ్ముట్టిని సంప్రదించా. ఆయనకి ఫోన్‌ చేసి ఇలా ప్రతినాయక పాత్ర ఉంది చేస్తారా అని అడిగా. దానికి ఆయన 'ఇదే మాట చిరంజీవిని అడుగుతారా' అని ప్రశ్నించారు. నేను 'అడగలేను' అన్నా. దాంతో ఆయన నవ్వుతూ పెట్టేశారు."

అల్లు అరవింద్​, సినీ నిర్మాత

ఇటీవలే దివంగత వైఎస్ రాజశేఖర్​ రెడ్డి బయోపిక్​లో మమ్ముట్టి నటించి ప్రేక్షకులను అమితంగా అకట్టుకున్నాడు. ఇప్పుడు మరో చారిత్రక నేపథ్య కథతో తెరపై కనిపించబోతున్నాడు.

ఇవీ చూడండి.. వెండితెరపై​ శభాష్​ 'మిథాలీ'​​... నటి ఎవరో తెలుసా..?

ABOUT THE AUTHOR

...view details