అసోంలోని ఓ ఆసుపత్రిలో కరోనా వార్డులో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అరుప్ సేనాపతి చేసిన డాన్స్ వీడియో వైరల్గా మారింది. అతడు పీపీఈ కిట్ ధరించి.. హృతిక్ రోషన్ నటించిన 'వార్' చిత్రంలోని ఘుంగ్రూ పాటకు డాన్స్ చేశాడు. ఆ వీడియోకు నెటిజన్లతో పాటు హీరో హృతిక్ రోషన్ కూడా ఫిదా అయ్యాడు.
ఆ డాక్టర్ స్టెప్పులకు హృతిక్ ఫిదా - అస్సామీ డాక్టర్ డాన్స్ వీడియో
అసోంకు చెందిన డాక్టర్ అరుప్ సేనాపతి.. పీపీఈ కిట్ ధరించి చేసిన డాన్స్ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఆ వీడియోకు ఫిదా అయిన హృతిక్ రోషన్.. వైద్యుడు వేసిన స్టెప్పులను నేర్చుకోవాలనుకుంటున్నట్లు రీట్వీట్ చేశాడు.
'ఏదో ఒకరోజు ఆ డాక్టర్లా స్టెప్పులు వేస్తా'
సిల్చార్ మెడికల్ కాలేజీకి చెందిన ఈఎన్టి స్పెషలిస్టు డాక్టర్ సేనాపతి సహోద్యోగి డాక్టర్ సయీద్ ఫైజన్ అహ్మద్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశాడు. దీనిపై స్పందించిన నటుడు హృతిక్ రోషన్.. ఆ వైద్యుడు వేసిన స్టెప్పులను తాను నేర్చుకోవాలనుకుంటున్నట్టు చెప్పాడు.
"డాక్టర్ అరుప్కు చెప్పండి. నేను అతడు వేసిన స్టెప్పులను నేర్చుకుని.. అసోంలో ఏదో ఒకరోజు అతడిలాగే డాన్స్ చేస్తా. అద్భుతమైన స్ఫూర్తి," అని హృతిక్ రోషన్ రీట్వీట్ చేశాడు.