తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హృతిక్ రోషన్​తో ఉన్న ఆ 'మిస్టరీ గర్ల్' ఎవరు? - hrithik roshan spotted with girlfriend

Hrithik roshan dating: ప్రముఖ కథానాయకుడు హృతిక్ రోషన్​తో ఓ అమ్మాయి కనిపించింది. మాస్క్ పెట్టుకోవడం వల్ల ఆమెను సరిగా గుర్తించలేకపోయిన హృతిక్ ఫ్యాన్స్.. ఎవరై ఉంటుందా అని చర్చించుకుంటున్నారు.

Hrithik Roshan
హృతిక్ రోషన్

By

Published : Jan 29, 2022, 2:22 PM IST

Hrithik roshan: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్​.. ఓ అమ్మాయితో కనిపించారు. శుక్రవారం రాత్రి ముంబయిలో ఓ రెస్టారెంట్​ నుంచి బయటకు వస్తూ కెమెరా కంటికి చిక్కారు. దీంతో ఫ్యాన్స్​.. సోషల్ మీడియాలో ఈ విషయం గురించి తెగ చర్చించుకుంటున్నారు. ఆ 'మిస్టరీ గర్ల్' ఎవరూ అంటూ మాట్లాడుకుంటున్నారు.

సుస్సానే ఖాన్​ను 2000లో పెళ్లి చేసుకున్న హృతిక్.. 2014లో ఆమెకువిడాకులు ఇచ్చారు. ఆ తర్వాత కంగనా రనౌత్​తో హృతిక్ డేటింగ్ కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఓ అమ్మాయితో హృతిక్ కనిపించేసరికి, అభిమానులు తెగ మాట్లాడేసుకుంటున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details