తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మోస్ట్​ హ్యండ్​సమ్ మ్యాన్'​గా హృతిక్ రోషన్ - సూపర్​ 30

బాలీవుడ్​ హీరో హృతిక్ రోషన్​.. ప్రముఖ హాలీవుడ్​ నటుల్ని వెనక్కి నెట్టి 'మోస్ట్​ హ్యండ్​సమ్​ మ్యాన్ ఇన్​ ద వరల్డ్'​గా నిలిచాడు.​ 'వార్​' సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నాడీ కథానాయకుడు.

హీరో హృతిక్ రోషన్

By

Published : Aug 17, 2019, 2:04 PM IST

Updated : Sep 27, 2019, 7:07 AM IST

తన నటనతోనే కాకుండా లుక్స్​తో ఆకట్టుకుంటున్న వారిలో బాలీవుడ్​ హీరో హృతిక్ రోషన్​ ముందుంటాడు. ఇటీవలే 'సూపర్​ 30'తో హిట్​ కొట్టిన ఈ కథానాయకుడు.. మరో ఘనత సొంతం చేసుకున్నాడు. ఓ యూఎస్​ ఏజెన్సీ నిర్వహించిన సర్వేలో హాలీవుడ్​ నటులు క్రిస్ ఏవాన్స్, రాబర్డ్​ పాటిన్సన్​, డేవిడ్​ బెక్​హమ్​ను వెనక్కి నెట్టి 'మోస్ట్​ హ్యండ్​సమ్ మ్యాన్​ ఇన్​ ద వరల్డ్​'గా నిలిచాడు. ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేశాడు హృతిక్.

హీరో హృతిక్ రోషన్

"ఇదేమంత గొప్ప విషయం కాదు. నా అభిప్రాయం ప్రకారం ఈ ప్రపంచంలో ఎవరైనా ఎక్కువగా కోరుకునేది, విలువైనదిగా ఏదైనా ఉంటే అది వారి వ్యక్తిత్వమే. అది ఎల్లప్పుడూ మిమ్మల్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది" -హృతిక్ రోషన్​, బాలీవుడ్​ కథానాయకుడు

'వార్​' సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు హృతిక్ రోషన్. ఇందులో టైగర్​ ష్రాఫ్​ మరో కథానాయకుడిగా నటిస్తున్నాడు. యాక్షన్​ సీక్వెన్స్​తో ఉన్న టీజర్​ ఇప్పటికే అభిమానుల్ని అలరిస్తోంది. అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: గూగుల్ ప్లే స్టోర్​లో సాహో వీడియో గేమ్​

Last Updated : Sep 27, 2019, 7:07 AM IST

ABOUT THE AUTHOR

...view details