తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇటు హృతిక్‌.. అటు సారా.. మధ్యలో ధనుష్‌! - hrithik

ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, ధనుష్ ఓ సినిమా చేయబోతున్నట్టు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వీరితో పాటు సారా అలీ ఖాన్ నటించనున్నట్టు సమాచారం. ధనుష్ గతంలో ఈ దర్శకుడితో రాంఝానా అనే సినిమాలో నటించాడు.

హృతిక్ - ధనుష్

By

Published : Jul 29, 2019, 5:05 AM IST

Updated : Jul 29, 2019, 5:11 AM IST

బాలీవుడ్ గాడ్​ ఆఫ్ గ్రీక్ హృతిక్ రోషన్.. దక్షిణాది సంచలన హీరో ధనుష్ కలిసి నటించబోతున్నారా! అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వీరిద్దరూ కలిసి పనిచేయనున్నట్టు సమాచారం. వీరితో పాటు సైఫ్ అలీ ఖాన్ తనయ సారా అలీ ఖాన్​ ఇందులో నటించనుందంట.

రాయ్​ దర్శకత్వంలో గత ఏడాది ఎన్నో అంచనాల నడుమ విడుదలైన షారుఖ్ 'జీరో' పరాజయం పాలైంది. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు ఆనంద్ ఎల్ రాయ్. అతడి నిర్మాణ సంస్థ కలర్ యెల్లో ఫిలిమ్స్ వర్గాలే ఈ విషయాన్ని చెప్పినట్టు సమాచారం.

ఎన్నో పరాజయాల అనంతరం సూపర్ 30 విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు హృతిక్. టైగర్​ ష్రాఫ్​తో కలిసి 'వార్'​ చిత్రంలోనూ నటిస్తున్నాడు. లవ్ ఆజ్​ కల్ సీక్వెల్​తో పాటు, కూలీ నెం.1 రీమేక్​లో పనిచేయనుంది సారా. ఒకవేళ రాయ్ సినిమా పట్టాలకెక్కితే వీరిద్దరికి అతడి దర్శకత్వంలో ఇదే తొలి సినిమా అవుతుంది.

ధనుష్ గతంలో రాయ్ దర్శకత్వంలో రాంఝానా చిత్రంలో నటించాడు. ఈ సినిమా కుదిరితే రాయ్​ దర్శకత్వంలో రెండో సినిమా అవుతుంది. బాలీవుడ్​లో రాంఝానాతో పాటు అమితాబ్​తో కలిసి 'షమితాబ్' అనే సినిమాలో నటించాడు ధనుష్.

ఇది చదవండి: రూ.10 కోట్ల పారితోషికం వదులుకున్న నయన్

Last Updated : Jul 29, 2019, 5:11 AM IST

ABOUT THE AUTHOR

...view details