తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హాలీవుడ్ నటుడు పీటర్ ఫోండా మృతి - peter fonda

హాలీవుడ్ నటుడు పీటర్​ ఫోండా (79) అనారోగ్యంతో లాస్​ ఏంజెలిస్​​లోని తన నివాసంలో మృతి చెందారు. 'ఈజీ రైడర్' చిత్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

పీటర్

By

Published : Aug 17, 2019, 11:53 AM IST

Updated : Sep 27, 2019, 6:49 AM IST

హాలీవుడ్​ నటుడు పీటర్ మృతి

హాలీవుడ్ నటుడు, దర్శకుడు పీటర్ ఫోండా(79) మరణించారు. ఊపిరితిత్తుల క్యాన్సర్​తో బాధపడుతున్న ఆయన అమెరికా లాస్​ ఏంజెలిస్​లోని తన నివాసంలో కన్నుమూశారు. హాలీవుడ్ దిగ్గజ నటుడు హెన్రీ ఫోండా తనయుడే పీటర్.

1940లో జన్మించిన పీటర్ ఫోండా ఈజీ రైడర్(1969) చిత్రం ద్వారా ప్రేక్షకుల్లో విశేష ఆదరణ పొందారు. అలీస్ గాడ్(1997), ద ఫ్యాషన్ ఆఫ్​ అయన్ ర్యాండ్(1999) సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

ఉత్తమ నటుడిగా ఒకసారి (అలీస్ గాడ్), ఉత్తమ స్క్రీన్​ప్లే రచయితగా (ఈజీ రైడర్​) మరోసారి ఆస్కార్​కు నామినేట్ అయ్యారు. అలీస్ గాడ్ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్​ అవార్డు అందుకున్నారు పీటర్.

ఇది చదవండి: గూగుల్ ప్లే స్టోర్​లో సాహో వీడియో గేమ్​

Last Updated : Sep 27, 2019, 6:49 AM IST

ABOUT THE AUTHOR

...view details