తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మే 9న 'హిప్పీ' ట్రైలర్ విడుదల.... - tollywood

కార్తీకేయ, దిగణన సూర్యవంశీ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'హిప్పీ'. ఈ సినిమా ట్రైలర్ మే 9న విడుదలవనుంది.

హిప్పీ

By

Published : May 7, 2019, 12:04 PM IST

'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ నటిస్తున్న రెండో చిత్రం 'హిప్పీ'. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్​కు మంచి స్పందన వచ్చింది. సినిమా ట్రైలర్​ను మే 9న విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు టి ఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. దిగణన సూర్యవంశీ , జజ్బా సింగ్ కథానాయికలుగా నటిస్తుండగా.. నివాస్ ప్రసన్న సంగీతం అందిస్తున్నాడు.

వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ తాను నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 7న విడుదలకానుంది. కార్తికేయ ప్రస్తుతం 'గుణ 369' అనే చిత్రంతో పాటు నాని 'గ్యాంగ్ లీడర్​లో' కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇవీ చూడండి.. మెట్​ గాలా ఈవెంట్​లో ప్రియాంక కిరాక్​ లుక్​

ABOUT THE AUTHOR

...view details