తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రభాస్​కు​ తల్లిగా అలనాటి అందాల భామ.! - భాగ్యశ్రీ తెలుగు సినిమా

బాలీవుడ్​లో ఎన్నో విజయాలు అందుకున్న నటి భాగ్యశ్రీ.. టాలీవుడ్​లోకి రీఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. డార్లింగ్​ ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమాలో అతడి తల్లిగా కనిపించనుందట.

hindi actor bhagyasree plays mother role
ప్రభాస్​కు​ తల్లిగా సీనియర్ హీరోయిన్

By

Published : Jan 22, 2020, 5:29 PM IST

Updated : Feb 18, 2020, 12:21 AM IST

కండలవీరుడు సల్మాన్​ఖాన్​తో 'మైనే ప్యార్​ కియా' సినిమాలో నటించిన భాగ్యశ్రీ.. ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్​గా కనిపించి, ప్రస్తుతం కుటుంబంతో సంతోషంగా గడుపుతోంది. అయితే టాలీవుడ్​లోకి ఆమె రీఎంట్రీ ఇవ్వనుందని, ప్రభాస్​కు తల్లిగా కనిపించనుందనే వార్త ఆసక్తి పెంచుతోంది.

పీరియాడిక్ డ్రామాగా తీస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తోంది. 'జిల్​' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో, లేదంటే వచ్చే సంవత్సరం వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ఇదీ చదవండి:మైమరిపిస్తున్న పాయల్​ అందాలు

Last Updated : Feb 18, 2020, 12:21 AM IST

ABOUT THE AUTHOR

...view details