తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పవన్ నుంచి లేఖ.. మాటలు రావట్లేదు' - మూవీ న్యూస్

పవన్​ తనను ప్రశంసిస్తూ లేఖ రాయడంపై నటి హిమజ ఆనందం వ్యక్తం చేశారు. ఆయనతో దిగిన ఫొటోను ఇన్​స్టాలో పంచుకున్నారు. క్రిష్-పవన్​ సినిమాలో ఈమె నటిస్తున్నారు.

himaja got act in pawan kalyan movie
హిమజకు పవన్ లేఖ.. ఉబ్బితబ్బిబ్బైన నటి

By

Published : Mar 1, 2021, 1:15 PM IST

Updated : Mar 1, 2021, 4:33 PM IST

చిన్నా, పెద్దా తేడా లేకుండా తోటి కళాకారులను సత్కరించడంలో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ముందుంటారు. ఇప్పుడు నటి హిమజకు అభినందనలు తెలుపుతూ ఆయన ఓ లేఖ రాశారు. బుల్లితెర నటిగా కెరీర్‌ను ప్రారంభించిన హిమజ.. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పవన్‌కల్యాణ్‌ - క్రిష్‌ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఆ సినిమా షూట్‌లోనూ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పవన్‌తో దిగిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా ఆమె అభిమానులతో పంచుకున్నారు. ఓ విషయమై ఆనందం వ్యక్తం చేశారు.

పవన్​కల్యాణ్​తో నటి హిమజ

"నటి హిమజకు, మీకు అన్ని శుభాలు జరగాలని, వృత్తిపరంగా మీరు ఉన్నతస్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను" అని పవన్‌ పంపించిన లేఖను షేర్‌ చేస్తూ.. తన ఆనందాన్ని మాటల్లో లేదా ఎమోజీల్లోనూ చెప్పలేకపోతున్నానని హిమజ తెలిపారు. మరోవైపు తమ సినిమాలో పనిచేసిన పహిల్వాన్లను పవన్‌ ఆదివారం సత్కరించారు.

మల్లయోధులతో పవన్​ కల్యాణ్

పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్‌లో పవన్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ఇందులో ఆయన వజ్రాల దొంగగా కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Last Updated : Mar 1, 2021, 4:33 PM IST

ABOUT THE AUTHOR

...view details