తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బరువు కారణంగా ఆ సినిమా ఛాన్స్​ మిస్​ అయింది' - bollywood

కాస్త బొద్దుగా ఉన్న కారణంగా 'విక్కీడోనర్'​లో నటించే అవకాశాన్ని కోల్పోయిందట బాలీవుడ్ నటి రాధికా ఆప్టే. అప్పటినుంచి బరువు విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటోందీ నటి.

రాధికా

By

Published : Jun 28, 2019, 5:01 AM IST

చిత్ర పరిశ్రమ అంటే ఓ గ్లామర్‌ ప్రపంచం. ఇక్కడ అభినయం కన్నా ముందు అందరి దృష్టినీ ఆకర్షించేంది అందమే. హీరోల విషయంలో ఇది కాస్త అటు ఇటుగా ఉన్నా ప్రేక్షకులు సర్దుకుపోతారేమో కానీ, కథానాయిక విషయంలో అందచందాలు తమ అంచనాలకు ఏమాత్రం తగ్గినా అసలు సహించలేరు. దర్శకనిర్మాతలు కూడా ప్రేక్షకుల దృష్టి కోణాన్ని మనసులో పెట్టుకొనే నాయికలను ఎంపిక చేసుకుంటారు.

ఈ చిత్రసీమలో చక్కనమ్మలు ఏమాత్రం బొద్దుగుమ్మలుగా మారినట్లు కనిపించినా అది అవకాశాలపై ప్రభావం చూపిస్తుంటుంది. ప్రస్తుత బాలీవుడ్‌ స్టార్‌ నాయిక, బోల్డ్‌ ఫెర్ఫామెన్స్‌కు చిరునామా అయిన రాధికా ఆప్టేకు కూడా ఓసారి ఇలాంటి అనుభవం ఎదురైందట. ఆమె అధిక బరువు ఉన్న కారణంగా ఓ హిట్‌ మూవీలో ఛాన్స్‌ కోల్పోయిందట. అదేంటి రాధిక అప్పుడూ.. ఇప్పుడూ స్లిమ్‌గానే ఉంది కదా అని అనుకోకండి. బాలీవుడ్‌ సినీవర్గాల్లో స్లిమ్‌ అంటే 'జీరో సైజ్‌' అని అర్థమట.

ఇంతకీ విషయమేంటంటే.. బాలీవుడ్‌ హిట్‌ చిత్రం 'విక్కీ డోనర్‌'లో కథానాయిక ఛాన్స్‌ కోసం ప్రయత్నించిన వాళ్లలో రాధిక కూడా ఉంది. కానీ, తన ఓవర్‌ వెయిట్‌ కారణంగా ఆ సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోయింది రాధిక. ఈ చిత్ర ఆడిషన్స్‌కు వెళ్లడానికి ముందు రాధిక ఓ విహార యాత్రకు వెళ్లిందట. అక్కడ ఆమె ఫుల్‌గా బీర్లు తాగేసి.. ఇష్టమొచ్చినట్లుగా డైట్‌ తప్పి తినేసింది. దీంతో ఆమె కొంత బొద్దుగా మారిందట. ఫలితంగా ఆ సినిమాలో నటించే అవకాశాన్ని చేజార్చుకుంది రాధిక. ఇక అప్పటి నుంచి ఆమె తన బరువు విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించడం మొదలుపెట్టింది.

ఇవీ చూడండి.. జూన్ 29న బుర్రకథ విడుదలయ్యేనా..?

ABOUT THE AUTHOR

...view details