రాశీఖన్నా(rashi khanna bollywood movies) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ కెరీర్లో ముందుకెళ్తోంది. తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటిస్తూనే బాలీవుడ్‌లోనూ మెరిసేందుకు ప్రయత్నాలు చేస్తోంది(rashi khanna upcoming movie). తాజాగా ఓ హిందీ మూవీలో ఆమె ఎంపికైనట్లు సమాచారం.
ఇటీవలే 'షేర్షా'(siddharth malhotra shershah) చిత్రంతో విజయాన్ని అందుకున్న సిద్ధార్థ్ మల్హోత్రా.. ప్రస్తుతం 'యోధా'లో నటిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు పుష్కర్ ఓజా దర్శకత్వం వహిస్తున్నారు. నేడు(గురువారం) ఈ చిత్ర ఫస్ట్‌లుక్ విడుదలైంది(siddharth malhotra yodha movie). ఈ చిత్రంలోనే ఇద్దరు కథానాయికలు నటించనున్నారని వారి వివరాలను త్వరలోనే తెలియజేస్తామని తెలిపింది చిత్రబృందం. ఆ ఇద్దరు హీరోయిన్లలలో ఒకరు దిశపటాని కాగా మరొకరు రాశీ అని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.