తెలుగు, తమిళ చిత్రాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నిక్కీ గల్రానీకి కరోనా సోకింది. వారం క్రితమే వైరస్ బారిన పడినా, ఈ విషయాన్ని ఆమె గురువారం స్వయంగా వెల్లడించింది. ప్రస్తుతం తన ఆరోగ్యం మెర్గుగానే ఉందని, ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నానని వెల్లడించింది.
"కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించండి. నేను పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నా. బయటపడతాననే నమ్మకం ఉంది. కానీ వయసు ఎక్కువున్న నా తల్లిదండ్రులకు వచ్చుంటే పరిస్థితి వేరేలా ఉండేది. కాబట్టి వీలైనంతవరకు మాస్క్లు తప్పనిసరిగా ధరించండి. భౌతిక దూరం పాటించండి. మన ఆరోగ్యం కోసమే సమాజంలో ఉన్న మిగతవారి గురించి ఆలోచించండి. నా ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటున్న వారికి ధన్యవాదాలు"