తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మరోసారి ఆ పాత్ర​లో సుధీర్​బాబు - 'వి' సినిమా

హీరో సుధీర్ బాబు ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నానని స్పష్టం చేశాడు. పోలీస్ ఆఫీసర్​గా ఓ చిత్రంలో.. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా మరో సినిమాలో నటిస్తున్నాడు.

సుధీర్​బాబు

By

Published : Jul 20, 2019, 7:55 PM IST

'వి' సినిమాలో నటుడు సుధీర్​బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఇంతవరకూ అతడి పాత్రపై చిత్రబృందం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు ట్విట్టర్​లో పంచుకున్నాడీ కథానాయకుడు. ఇందులో నేచురల్ స్టార్ నాని ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించున్నాడని సమాచారం. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.

సుధీర్​బాబు ట్వీట్

అదితీ రావ్ హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్​గా నటిస్తున్నారు. అమిత్‌ త్రివేది సంగీతమందిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే నానితో 'అష్టాచమ్మా', 'జెంటిల్ మెన్'... సుధీర్ బాబుతో 'సమ్మోహనం' చిత్రాలు తీశాడు ఇంద్రగంటి.

పుల్లెల గోపీచంద్ బయోపిక్​లోను గోపీచంద్​ పాత్రలో నటిస్తున్నట్లు చెప్పాడు సుధీర్​బాబు. ఈ చిత్రానికి ప్రవీణ్ కుమార్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇది సంగతి:హరితేజ గాత్రంతో 'ఓ సక్కనోడా' పాట విన్నారా?

ABOUT THE AUTHOR

...view details