తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరో రామ్​కు గాయం.. షూటింగ్​ నిలిపివేత - ram linguswamy movie

హీరో రామ్​(ram injured) పోతినేనికి గాయమైంది. జిమ్​ చేస్తుండగా ఆయన మెడ పట్టేసింది. దీంతో తన 19వ సినిమా(ram linguswamy movie) షూటింగ్​ తాత్కాలికంగా నిలిచిపోయింది.

rampotineni
రామ్ పోతినేని

By

Published : Oct 4, 2021, 12:14 PM IST

Updated : Oct 4, 2021, 12:40 PM IST

హీరో రామ్‌పోతినేనికి(ram injured) స్వల్ప గాయమైంది. ప్రముఖ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్‌లో(ram linguswamy movie) తెరకెక్కనున్న సినిమా కోసం వర్కౌట్లు చేస్తుండగా జిమ్‌లో గాయపడ్డారు. ఆయన మెడకు స్వల్పగాయం కావడం వల్ల చిత్ర షూటింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.

హీరో రామ్​కు గాయం

యాక్షన్‌, ఫ్యామిలీ(ram pothineni 19 movie cast) ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈసినిమాలో రామ్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు. 'ఉప్పెన' హీరోయిన్‌ కృతిశెట్టి హీరోయిన్​. ఆది పినిశెట్టి కీలకపాత్రలో కనిపించనున్నారు. మరో భామ అక్షరగౌడ ప్రత్యేక ఆకర్షణ కానుంది. శ్రీనివాసా సిల్వర్ స్ర్కీన్‌ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం 'రాపో 19'గా ప్రచారంలో ఉంది.

ఇదీ చూడండి:'నారప్ప' లొకేషన్స్​.. రామ్​ కెరీర్​లోనే రికార్డు ధర!

Last Updated : Oct 4, 2021, 12:40 PM IST

ABOUT THE AUTHOR

...view details