తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఉపాసన.. నీవు చేసే ఏ పనీ వృథా కాదు : చెర్రీ - ఉపాసన శుభాకాంక్షలు

టాలీవుడ్​ హీరో రామ్​చరణ సతీమణి ఉపాసన జన్మదినం సందర్భంగా ఆమెకు ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలిపాడు చెర్రీ. ఆమె దయా గుణం గురించి ఇన్​స్టాలో ఓ ఆసక్తికర కామెంట్​ను పోస్ట్​ చేశాడు.

ram
రామ్​చరణ్​

By

Published : Jul 20, 2020, 9:07 PM IST

"దయా గుణంతో నువ్వు చేసే ఏ పనీ వృథా కాదు. అయితే ఎంత చిన్న పనైనా సరే. నువ్వు ఇలాగే కొనసాగిస్తే.. దానికి తగ్గ ప్రతిఫలం దక్కుతూనే ఉంటుంది" అంటూ ప్రముఖ కథానాయకుడు రామ్‌చరణ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో రాసుకొచ్చాడు. ఆయన సతీమణి ఉపాసన జన్మదినం సందర్భంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఆమె దయా గుణం గురించి ఇన్‌స్టా పోస్టులో ప్రస్తావించాడు. పువ్వుల వెనుక నిల్చుని ఆమె దీర్ఘంగా ఆలోచిస్తున్న ఓ ఫొటోను జత చేశాడు. మరోవైపు ఉపాసన జన్మదినం సందర్భంగా నెటిజన్లు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కరోనా కట్టడిలో భాగంగా గతంలో లాక్‌డౌన్ విధించిన‌ సమయంలో ఈ జంట ఇంట్లో గడిపిన ముచ్చటైన క్షణాలను అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం కరోనా కారణంగా 'ఆర్‌ఆర్‌ఆర్' షూటింగ్ వాయిదా పడడం వల్ల రామ్‌చరణ్‌ ఇంటివద్దనే ఉంటున్నాడు. ఉపాసన తనదైన శైలిలో ఆరోగ్యం సహా అనేక విషయాలపై ప్రజలకు తరుచూ అవగాహన కల్పిస్తుంది.

ఇది చూడండి : ఈ ప్రపంచ సుందరికి చెస్​ అంటే మక్కువట!

ABOUT THE AUTHOR

...view details