ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్'గా అలరించిన రామ్ పోతినేని.. మాస్ పాత్రతో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నాడు. ఆ ఆనందంలో గుండు కొట్టించుకుని ఆ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. "మైల్డ్లీ వైల్డ్/ వైల్డ్లీ మైల్డ్?" అంటూ క్యాప్షన్ జోడించాడు. చాలా రోజుల తర్వాత తనకు విజయం దక్కడమే ఇందుకు కారణమా లేదా కొత్త సినిమా కోసమా అని చర్చించుకుంటున్నారు అభిమానులు.
గుండు కొట్టించుకున్న హీరో రామ్.. ఎందుకు? - పూరీ జగన్నాథ్
గుండుతో ఉన్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు యువ హీరో రామ్. దీనిపై విభిన్నంగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
గుండు కొట్టించుకున్న హీరో రామ్.. ఎందుకు?
ఇస్మార్ట్ శంకర్‌తో హీరోకే కాకుండా దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు చాలా కాలం తర్వాత సరైన హిట్ పడింది. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటించారు. మణిశర్మ సంగీతమందించాడు. చార్మీతో పాటు పూరీ సంయుక్తంగా నిర్మించాడు.
ఇది చదవండి: ఎన్కౌంటర్ శంకర్‌తో 'ఇస్మార్ట్ శంకర్'