యువ కథానాయకుడు నితిన్ ఓ ఇంటివాడు అయ్యాడు. ఆదివారం రాత్రి 8.30 గంటలకు శాలినితో నితిన్ వివాహం ఘనంగా జరిగింది. కరోనా నిషేధాజ్ఞలతో ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, కొంతమంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. ప్రఖ్యాత ఫలక్‌నుమా ప్యాలెస్ ఈ వేడుకకు వేదికైంది. ఈ సందర్భంగా నూతన వధూవరులను అతిథులు ఆశీర్వదించారు.
మూడు ముళ్లతో ఒక్కటైన నితిన్-షాలిని జంట - hero nithin marriage
టాలీవుడ్ హీరో నితిన్, ప్రేయసి షాలినిల వివాహం వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య షాలిని మెడలో మూడు ముళ్లు వేశాడు నితిన్.
ఘనంగా నితిన్, షాలినిల వివాహం
వివాహానికి తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్.. నటీనటులు వరుణ్‌తేజ్, సాయి తేజ్ తదితరులు హాజరయ్యారు.