టాలీవుడ్ హీరో గోపీచంద్ కొత్త సినిమాకు మాస్ టైటిల్ పెట్టారు. 'సీటీమార్' అనే పేరు నిర్ణయిస్తూ, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఈరోజు విడుదల చేశారు. విజిల్ పట్టి, కిందకు చూస్తున్న ఈ హీరో లుక్ ఆకట్టుకుంటోంది. ఇందులో కబడ్డీ కోచ్‌గా కనిపించనున్నాడు గోపీచంద్. తమన్నా, దిగంగన సూర్యవంశీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భూమిక కీలక పాత్రలో కనిపించనుంది.
కబడ్డీ కోచ్‌గా మారిన హీరో గోపీచంద్ - గోపీచంద్ కొత్త చిత్రం
హీరో గోపీచంద్ కొత్త సినిమాకు సీటీమార్ టైటిల్ పెట్టారు. ఈరోజు(సోమవారం) ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. కబడ్డీ నేపథ్య కథతో ఈ సినిమా తీస్తున్నారు.
సీటీమార్ సినిమాలో హీరో గోపీచంద్
గోపీచంద్‌తో 'గౌతమ్ నంద' తీసిన సంపత్ నంది.. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆత్రేయపురంలో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వేసవికి ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముందీ చిత్రం.
Last Updated : Feb 28, 2020, 2:48 AM IST