దిశ అత్యాచారం, హత్య కేసులోని నిందితులు పోలీసు కాల్పుల్లో శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఈ వార్తను ఉదయం చూసిన మెగాస్టార్ చిరంజీవి.. సత్వర న్యాయం అంటే ఇదేనని భావించినట్లు చెప్పాడు. కామంతో కళ్లు మూసుకుపోయి ఇలాంటి నేరాలు చేసే ఎవరికైనా ఇది కనువిప్పు కలిగించాల్సిందేనని అన్నాడు.
"అత్యంత పాశవికంగా ప్రవర్తించిన ఆ నలుగురి మరణంతో 'దిశ' ఆత్మకు శాంతి చేకూరినట్లయింది. కడుపుకోతతో బాధపడుతున్న 'దిశ' తల్లిదండ్రుల ఆవేదనకు ఊరట లభించింది. ఆడపిల్లల్ని ఆటవస్తువుగా పరిగణించే వారిపై దారుణమైన ఆకృత్యాలకు పాల్పడే మానవ మృగాలకు ఇదో గుణపాఠం కావాలి" -చిరంజీవి, సినీ నటుడు