సార్వత్రిక ఎన్నికలు 2019లో ప్రముఖ నటి, సిట్టింగ్ ఎంపీ హేమమాలిని విజయం సాధించారు. ధర్మేంద్ర కుమారుడు సన్నీ దేఓల్ కూడా గెలుపొందాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు ఎంపీలుగా లోక్‌సభకు వెళ్లనున్నారు.
హేమమాలిని, సన్నీ దేఓల్ విజయం - సన్నీడియోల్
బాలీవుడ్ నటి హేమమాలిని ఆర్ఎల్డీ నాయకుడైన కున్వార్ నరేంద్ర సింగ్‌పై గెలుపొందారు. మధుర నుంచి పోటీ చేసిన హేమ వరుసగా రెండోసారి గెలిచారు. సన్నీ దేఓల్ గురుదాస్‌పుర్ నుంచి విజయం సాధించాడు.
హేమమాలిని
ఉత్తరప్రదేశ్‌లోని మధుర నుంచి పోటీ చేసిన హేమమాలిని.... సమీప ప్రత్యర్థి ఆఎర్ఎల్డీ నాయకుడైన కున్వార్ నరేంద్ర సింగ్‌పై గెలుపొందారు.
భాజపా తరపున పంజాబ్ గురుదాస్‌పుర్ నుంచి పోటీ చేశాడు సన్నీ. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నాయకుడైన సునీల్ కుమార్ జాఖర్‌పై విజయం సాధించాడు. తొలిసారి ఎంపీగా గెలిచాడు.