రజనీకాంత్ ఆరోగ్యంపై శనివారం మరో హెల్త్ బులెటిన్‌ను అపోలో ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంకా కొన్ని వైద్య పరీక్షల నివేదికలు రావాల్సి ఉందిని వెల్లడించారు. ఇప్పటివరకు చేసిన వైద్య పరీక్షల్లో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వైద్య పరీక్షల నివేదికలు చూసి ఆదివారం రజనీకాంత్‌ను డిశ్ఛార్జ్ చేస్తామని తెలిపారు
నేడు రజనీకాంత్‌ను డిశ్ఛార్జి చేస్తాం: అపోలో వైద్యులు
18:06 December 26
నేడు రజనీకాంత్‌ను డిశ్ఛార్జి చేస్తాం: అపోలో వైద్యులు
స్పందించిన ప్రముఖులు..
రజనీకాంత్ ఆరోగ్యంపై తెలంగాణ గవర్నర్ తమిళసై అపోలో వైద్యులతో మాట్లాడారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ట్విటర్ వేదికగా స్పందించిన మంత్రి కేటీఆర్.. త్వరగా కొలుకోవాలని కోరుకున్నారు.
జనసేన అధినేత హీరో పవన్‌కల్యాణ్ కూడా స్పందించారు. ‘అస్వస్థతతో రజనీకాంత్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుసుకొని బాధపడ్డాను. ఆయనకు కరోనా లేదని వైద్యులు ప్రకటించడం ఊరటనిచ్చింది. మనోధైర్యం మెండుగా ఉన్న రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని తెలిపారు. రజనీ ఆరోగ్యంపై కమల్‌హాసన్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, తెదేపా అధినేత చంద్రబాబు తదితర సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఆరాతీశారు.
సంబంధిత కథనం:రజినీకాంత్‌కు అస్వస్థత.. జూబ్లీహిల్స్ అపోలోలో చేరిన సూపర్ స్టార్