తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మాజీ ముఖ్యమంత్రి కుమారుడు నిఖిల్​ నిశ్చితార్థం - nikhil kumaraswamy

హీరో నిఖిల్​ నిశ్చితార్థం రేవతితో బెంగళూరులో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నేతలు, అభిమానుల హాజరయ్యారు.

HD Kumaraswamy's Son Nikhil Engaged To Congress Leader's Grand-Niece
మాజీ ముఖ్యమంత్రి కుమారుడు నిఖిల్​కు నిశ్చితార్థం

By

Published : Feb 10, 2020, 4:39 PM IST

Updated : Feb 29, 2020, 9:22 PM IST

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ​ నిశ్చితార్థం.. రేవతితో వైభవంగా జరిగింది. బెంగళూరులోని తాజ్ వెస్ట్​ ఎండ్​ హోటల్లో ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. నిఖిల్ తాత, మాజీ ప్రధానమంత్రి దేవెగౌడతో పాటు అన్ని పార్టీల ప్రముఖులు, ఎమ్మెల్యేలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

మాజీ ముఖ్యమంత్రి కుమారుడు నిఖిల్​కు నిశ్చితార్థం

ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను తన ఫేస్​బుక్​లో పంచుకున్నాడు నిఖిల్​. ఇతడు​ 'జాగ్వార్​' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. బాస్కెట్​బాల్ కథతో తీస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. గతేడాది కర్ణాటక లోక్​సభ ఎన్నికల్లో మాండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసి, స్వతంత్ర అభ్యర్థి సుమలతా అంబరీశ్​ చేతిలో ఓడిపోయాడు.

ఇదీ చదవండి: హీరో విజయ్​కు ఆదాయ పన్ను శాఖ సమన్లు

Last Updated : Feb 29, 2020, 9:22 PM IST

ABOUT THE AUTHOR

...view details