హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్... ప్రస్తుతం బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్ సరసన ‘దే దే ప్యార్ దే’ లో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పాటలతో పాటు ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మే 17న విడుదల కానుందీ చిత్రం.
ప్రాక్టీస్ వీడియోతో దుమ్మురేపుతున్న రకుల్ - అజయ్ దేవగణ్
రకుల్ ప్రీత్ సింగ్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. తన కొత్త బాలీవుడ్ సినిమా 'దే దే ప్యార్ దే' లోని హౌలి హౌలి పాట ప్రాక్టీసు వీడియోతో కుర్రకారు మనసు దోచేస్తోంది.
ప్రాక్టీస్ వీడియోతో దుమ్మురేపుతున్న రకుల్
తాజాగా ఈ సినిమాకు సంబంధించి రకుల్ ప్రీత్‌కు చెందిన ఒక వీడియో యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయీస్‌తో కలిసి తన కొత్త సినిమాలోని ‘హౌలి హౌలి’ సాంగ్‌కు అద్భుతంగా నృత్యం చేసింది రకుల్. ఈ పాటలో వీరిద్దరి డాన్స్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే తొమ్మిదన్నర లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు.