యువనటి మీరా మిథున్‌ను కేరళ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అయితే పోలీసులపై ఆమె గట్టి గట్టిగా అరుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
యువనటి అరెస్టు.. ఆ వీడియోనే కారణం - మూవీ న్యూస్
ఓ కులాన్ని కించపరిచేలా మాట్లాడి, ఆ వీడియోను పోస్ట్ చేసినందుకుగానూ హీరోయిన్ మీరా మిథున్‌ను అరెస్టు చేశారు. కేరళలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
మీరా మిథున్
పలు టీవీ షోలు, తమిళ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న మీరా మిథున్.. దళితులను కించపరిచేలా ఇటీవల పలు వ్యాఖ్యలు చేసింది. అవి కాస్త వివాదస్పదమై, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో ఆమెపై సెక్షన్ 7 ప్రకారం పరువుకు నష్టం కలిగించేలా వీడియోను పోస్ట్ చేసినందుకు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి: