తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శంకర్ సినిమా నుంచి తప్పుకోలేదు: కాజల్ - kajal agarwal

'భారతీయుడు 2' సినిమా నుంచి తాను తప్పుకోలేదని స్పష్టం చేసింది కాజల్ అగర్వాల్. షూటింగ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని తెలిపింది.

కాజల్

By

Published : Aug 16, 2019, 8:49 AM IST

Updated : Sep 27, 2019, 3:58 AM IST

తమిళ హీరో కమల్ హాసన్ ప్రధానపాత్రలో ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్న చిత్రం 'భారతీయుడు 2'. ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. చాలా రోజుల క్రితమే సినిమా ప్రారంభమవ్వాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.

కాజల్ అగర్వాల్

ఈ సినిమాలో హీరోయిన్​గా కాజల్ అగర్వాల్ ఎంపికైంది. అయితే షూటింగ్ వాయిదా వల్ల డేట్స్​ కుదరక ఈ హీరోయిన్​ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. ఈ విషయమై కాజల్ స్పందించింది. అలాంటిదేమీ లేదని.. ఇంతటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నుంచి తప్పుకునే ఛాన్సేలేదని స్పష్టం చేసింది. షూటింగ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది.

కాజల్ అగర్వాల్

ఈ సినిమా కోసం పురాతనమైన.. కేరళ మార్షల్ ఆర్ట్స్​ నేర్చుకుంది కాజల్. ప్రస్తుతం ఈ కథానాయిక నటించిన 'రణరంగం' స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదలైంది.

ఇవీ చూడండి.. శత్రువుల గెటప్​లో అల్లు అర్జున్​ కొడుకు

Last Updated : Sep 27, 2019, 3:58 AM IST

ABOUT THE AUTHOR

...view details