తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గుణ 369: 'రూపం వేరు, నిజస్వరూపం వేరు' - అర్జున్ జంధ్యాల

'ఆర్.ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన  'గుణ 369' ట్రైలర్ విడుదలైంది. అనఘ హీరోయిన్. ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

గుణ 369: 'మనిషి రూపం వేరు నిజస్వరూపం వేరు'

By

Published : Jul 17, 2019, 1:01 PM IST

గొడవ పడితే మిగిలేది ఏముండదు గొడవ తప్ప అని అంటున్నాడు హీరో కార్తికేయ. హీరోగా నటించిన 'గుణ 369' ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం చిత్ర ట్రైలర్​ను విడుదల చేశారు. ఇందులో క్లాస్, మాస్ లుక్​లో అలరిస్తున్నాడీ కథానాయకుడు.

''మన అనుకున్నవాళ్లు బావుండాలంటే ప్రపంచంలో ప్రమాదాలు ఏ రూపంలో వస్తాయో చెప్పి పెట్టాలిరా గుణ'' అనే సంభాషణతో ట్రైలర్ ప్రారంభమైంది. ''నేను ఎడారిలో ఉన్నా... గొంతు ఎండిపోతోంది... కొన్నే నీళ్లు దొరికాయి.. ఇవి మంచివా? చెడ్డవా అని ఆలోచించే ఓపిక, తీరిక నాకు లేదు... తాగి దాహం తీర్చుకోవడమే'' అంటూ హీరో కార్తికేయ చెప్పిన డైలాగులు చిత్రంపై అంచనాల్ని పెంచుతున్నాయి.

అనఘ హీరోయిన్​గా నటించింది. చైతన్య భరద్వాజ్ సంగీతాన్ని అందించాడు. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యదార్థ కథతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని కచ్చితంగా ఆకట్టుకుంటుందని చెప్పాడు చిత్ర దర్శకుడు అర్జున్ జంధ్యాల.

ఇది చదవండి: 'గుణ 369'.. లవ్, యాక్షన్, సెంటిమెంట్

ABOUT THE AUTHOR

...view details