తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'గుణ 369'.. లవ్, యాక్షన్, సెంటిమెంట్ - tollywood

టాలీవుడ్ హీరో కార్తికేయ ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం 'గుణ 369'. ఈ సినిమా టీజర్ ఆకట్టుకునేలా ఉంది.

గుణ

By

Published : Jun 17, 2019, 1:08 PM IST

'ఆర్​ఎక్స్100' ఫేం కార్తికేయ హీరోగా రూపొందుతున్న చిత్రం 'గుణ 369'. అర్జున్ జంధ్యాల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు. అనగ హీరోయిన్​గా నటిస్తోంది.

తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. లవ్, యాక్షన్, సెంటిమెంట్​లతో కూడిన సన్నివేశాలతో ఆకట్టుకునేలా ఉంది. "మనం చేసిన తప్పుల వల్ల మన జీవితానికి ఏం జరిగినా ఫర్వాలేదు. కానీ పక్కనోడి జీవితానికి ఏ హానీ జరగకూడదు" అనే డైలాగ్​తో టీజర్ ప్రారంభమైంది. చివర్లో కార్తికేయ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ బాగుంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇవీ చూడండి.. 'ద లయన్​ కింగ్'​కు తండ్రీ కొడుకుల డబ్బింగ్

ABOUT THE AUTHOR

...view details