'అవతార్'.. ఈ సినిమా గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ టైటిల్‌ను భారత నటుడి దగ్గర్నుంచి తీసుకున్నాడట జేమ్స్ కామెరూన్. తాజాగా ఈ సినిమా టైటిల్ తానే ఇచ్చానని తెలిపాడు బాలీవుడ్ నటుడు గోవింద. 'అవతార్'లో తనకు అవకాశం కూడా వచ్చిందని చెప్పాడు.
"అవతార్' టైటిల్‌ను కామెరూన్‌కు ఇచ్చింది నేనే. సినిమా బాగా ఆడుతుందని ముందే చెప్పా. ఆ చిత్రాన్ని తీయడానికి ఏడేళ్లు పడుతుందనీ చెప్పా. అందుకు అతడు అంగీకరించలేదు. మీరెలా చెప్పగలరు అంటూ ఎదురు ప్రశ్నించాడు. దాదాపు అసాధ్యమైన సినిమాను మీరు ఊహిస్తున్నారని, సినిమా విడుదల కావడానికి 8, 9 ఏళ్లు పడుతుందని స్పష్టం చేశా". -గోవింద బాలీవుడ్ నటుడు.
'అవతార్'లో పాత్ర వచ్చిందని అయితే తీరిక లేక వదులుకున్నాని చెప్పాడు గోవింద.