సమంత(Samantha) ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న 'శాకుంతలం'(Shaakuntalam) షూటింగ్ హైదరాబాద్‌లో ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. కరోనా కారణంగా వాయిదాపడిన ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. లాక్‌డౌన్ సమయంలోనే ఈ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా భారీ సెట్స్‌ను తీర్చిదిద్దారు. ప్రస్తుతం అందులోనే చిత్రీకరణ చేస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. నీలిమ గుణ నిర్మిస్తున్నారు. దిల్‌రాజు సమర్పకులు. సమంతతోపాటు దేవ్ మోహన్ ముఖ్యభూమిక పోషిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది.
గోపీచంద్ కొత్త కబురు