హీరో గోపీచంద్- దర్శకుడు సంపత్ నంది కాంబోలో తెరకెక్కుతోన్న 'సీటీమార్' సినిమా టీజర్ విడుదలైంది. యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ టీజర్ ఆద్యంతం అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. 'కబడ్డీ.. మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట' అంటూ గోపిచంద్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్ర కబడ్డీ జట్టుకు కోచ్‌గా, తమన్నా తెలంగాణ జట్టుకు కోచ్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మరో కథానాయికగా దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. పోసాని కృష్ణమురళి, రావు రమేశ్, భూమిక, రెహమాన్ తదితరులు కనిపించనున్నారు.
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న 'సర్కారు వారి పాట' తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తైంది. ఈ విషయాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్గా కీర్తీసురేశ్ నటిస్తోంది.