తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Seetimaarr: గోపిచంద్​ 'సీటీమార్'​ ట్రైలర్​ అదుర్స్​ - tamanna seetimaar

గోపిచంద్​, తమన్నా జంటగా నటించిన 'సీటీమార్'(Gopichand Seetimaarr)​ సినిమా ట్రైలర్​ విడుదలైంది. ఆద్యంతం ఈ ప్రచారం చిత్రం భారీ యాక్షన్​, పవర్​ఫుల్​ డైలాగ్​లతో ఆకట్టుకుంటోంది.

gopichand
గోపిచంద్​

By

Published : Aug 31, 2021, 3:17 PM IST

'రూల్స్​ ప్రకారం ఆడితే ఆడివస్తారు, రూట్​ లెవల్​ నుంచి ఆలోచించి పంపిస్తే పేపర్​లో వస్తారు', 'ఆడపిల్లలు బయటకు వెళ్లేటప్పుడు కావాల్సింది మగాడి తోడు కాదు, ధైర్యం అనే తోడు' వంటి పవర్​ఫుల్​ డైలాగ్​లతో హీరో గోపిచంద్​ అదరగొట్టారు. ఆయన నటించిన 'సీటీమార్'​ సినిమా(Gopichand Seetimaarr) ట్రైలర్​ను ఎనర్జిటిక్​ స్టార్​ రామ్​ పోతినేని విడుదల చేశారు. ఇందులోనే పవర్​ఫుల్​ యాక్షన్​, భారీ డైలాగ్​లతో గోపిచంద్​ తనలోని మాస్​ యాక్టింగ్​ను మరోసారి బయటపెట్టారు. ఇక తమన్నా బ్యూటీ, రావురమేష్​ విలనిజంతో ఆద్యంతం ఈ ప్రచారచిత్రం అభిమానులను ఆకట్టుకుంటోంది.

కబ్డడీ నేపథ్యంలో సాగే ఈ కథలో గోపిచంద్​,తమన్నా(Gopichand tamannah movie) కబడ్డీ కోచ్​ల పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతమందించగా, శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి దర్శకుడు సంపత్ నంది. వినాయక చవితి పురస్కరించుకుని సెప్టెంబరు 10న థియేటర్లలలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం.

ఇదీ చూడండి: 'వరుడు కావలెను' టీజర్.. 'తుగ్లక్ దర్బార్' ట్రైలర్

ABOUT THE AUTHOR

...view details