గోపీచంద్ - రాశీఖన్నా కలిసి మరో చిత్రంలో నటించబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇప్పటికే 'జిల్', 'ఆక్సిజన్' సినిమాల్లో ఈ జోడీ సందడి చేసింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వినోదం పంచనున్నట్లు తెలుస్తోంది.
రాశీఖన్నా 'పక్కా కమర్షియల్'.. ఆ హీరోతో మూడోసారి! - రాశీఖన్నా బాలీవుడ్
గోపీచంద్‌తో మూడోసారి, మారుతితో రెండోసారి కలిసి పనిచేసేందుకు రాశీఖన్నా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ చిత్రం తీస్తున్నారు. యువీ క్రియేషన్స్, జీఏ2 సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసమే కోసం కథానాయికగా రాశీఖన్నాను ఎంపిక చేసినట్టు సమాచారం. మారుతి గత చిత్రం 'ప్రతిరోజూ పండగే'లోనూ రాశీఖన్నానే కథానాయిక. అందులో ఏంజిల్ ఆర్ణగా కనిపించి భలేగా నవ్వించింది. మారుతి మరోసారి రాశీ కోసం అలాంటి పాత్రని సృష్టించినట్టు సమాచారం. దీనికి 'పక్కా కమర్షియల్' అనే పేరు ప్రచారంలో ఉంది.
ఇది చదవండి:14వేల అడుగుల ఎత్తు నుంచి దూకేశా: రాశీఖన్నా