తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Gopichand New Movie: ఆగస్టులో 'ఆరడుగుల బుల్లెట్​' - ఆరడుగుల బుల్లెట్​

'ఆరడుగుల బుల్లెట్‌'గా దూసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు కథానాయకుడు గోపీచంద్‌(Gopichand New Movie). దర్శకుడు బి.గోపాల్‌ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఆగస్టులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Gopichand new movie Aaradugula Bullet to hit screens in August
Gopichand: ఆగస్టులో 'ఆరడుగుల బుల్లెట్​'

By

Published : Jul 5, 2021, 7:35 AM IST

Updated : Jul 5, 2021, 11:45 AM IST

గోపీచంద్‌ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు బి.గోపాల్‌ తెరకెక్కించిన చిత్రం 'ఆరడుగుల బుల్లెట్‌'(Aaradugula Bullet). నయనతార(Nayanthara) కథానాయిక. ఎప్పుడో విడుదలకావాల్సిన ఈ చిత్రం పలు కారణాల వల్ల వాయిదాపడింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

"ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నాం. గోపీచంద్‌- నయనతార జోడీ, బి. గోపాల్‌ దర్శకత్వం, మణిశర్మ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం" అని చిత్రబృందం ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ చిత్రాన్ని జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేటు లిమిటెడ్‌ పతాకంపై తాండ్ర రమేశ్‌ నిర్మించారు. ఈ సినిమాలో ప్రకాశ్‌ రాజ్, బ్రహ్మానందం, అభిమన్యు సిన్హా కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ ఈ సినిమాకు కథను అందించారు.

'పక్కా కమర్షియల్​'గా..

గోపీచంద్​ కథానాయకుడిగా నటిస్తోన్న మరో చిత్రం 'పక్కా కమర్షియల్​'(Pakka Commercial). మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో రాశీ ఖన్నా కథానాయిక. గీతా ఆర్ట్స్‌-2, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇటీవలే గోపీచంద్​ పుట్టినరోజు సందర్భంగా ఇందులోని పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. షూటింగ్​ ఇప్పటికే తుదిదశకు చేరుకోగా.. మరోవైపు పోస్ట్​ ప్రొడక్షన్​ వర్క్స్​ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని కూడా ఆగస్టులోనే విడుదల చేసేందుకు నిర్మాణసంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి.

ఇదీ చూడండి..Mehreen: హీరోయిన్​ పెళ్లి రద్దుకు కారణమిదే!

Last Updated : Jul 5, 2021, 11:45 AM IST

ABOUT THE AUTHOR

...view details