తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తండ్రితో 'పేడ' అమ్మాయి - upsana learning moderan Forming

లాక్​డౌన్​లో ఏదో ఒక కొత్త పని చేస్తూ కనిపించింది మెగా కోడలు ఉపాసన. ప్రస్తుతం ఫామ్​​హౌస్​లో ఆధునిక వ్యవసాయం నేర్చుకుంటున్నట్టు సోషల్​ మీడియా వేదికగా తెలిపింది. దానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర ఫొటోలను పంచుకుంది.

Gobar Girl with Dad - the Modern Day Farmer
'తండ్రితో పేడ అమ్మాయి'

By

Published : May 15, 2020, 7:50 AM IST

మెగా కోడలు ఉపాసన కొణిదెల.. తాజాగా కొన్ని ఆసక్తికర ఫొటోలను షేర్​ చేసింది. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ కొత్తకొత్త చిట్కాలు చెప్పే ఉపాసన.. తండ్రి అనిల్​ కామినేనితో కలిసి తమ ఫామ్​హౌస్​లో ఆధునిక వ్యవసాయం నేర్చుకుంటోంది. ఈ సందర్భంగా అక్కడున్న ఆవుకు మేత వేసి పేడను ఎత్తిన చిత్రాలను పంచుకుంది. తనకు తాను ఆధునిక రైతుగా అభివర్ణించుకుంది.

"సేంద్రీయ వ్యవసాయం ఎలాగో నేర్చుకుంటున్నాను. ఎరువు తయారుచేయడం, ఆహార వ్యర్థాలను సద్వినియోగం చేసుకోవడం ఎలాగో శిక్షణ తీసుకుంటున్నాను. నిరాడంబర జీవితాన్ని అలవాటు చేసుకుంటున్నాను" అని ఉపాసన పేర్కొంది.

ఇదీ చూడండి.. దేవదాసు గెటప్​ నుంచి 'ఇస్మార్ట్​'గా మారిన రామ్

ABOUT THE AUTHOR

...view details