గోల్డెన్ స్టార్ గణేశ్, టాప్ హీరోయిన్ రష్మిక మందణ్న జంటగా నటించిన చిత్రం 'గీతా ఛలో'. శ్రీ రాజేశ్వరి ఫిల్మ్ పతాకంపై డి.దివాకర్ సమర్పణలో మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను విశాఖలో నిర్వహించారు. శాసనమండలి సభ్యుడు దువ్వారపు రామారావు, సినీ నటుడు ప్రసన్నకుమార్, తదితరులు హాజరయ్యారు.
ఘనంగా 'గీతా ఛలో' ప్రీ రిలీజ్ వేడుక - gettha chalo
కన్నడలో ఘనవిజయం సాధించి తెలుగులోకి వస్తున్న చిత్రం 'గీతా ఛలో'. విశాఖలో ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక జరిగింది.
గీతా ఛలో
"ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. కన్నడలో రూ. 30 కోట్లు వసూలు చేసింది. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కూ బాగా నచ్చుతుంది. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం".
మామిడాల శ్రీనివాస్, నిర్మాత