డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టు (Shahrukh Son Arrested in Drug Case) అయిన నాటి నుంచి షారుక్ ఖాన్ కుటుంబంలో కలత నెలకొంది. కుమారుడి బెయిల్ కోసం షారుక్ సహా తల్లి గౌరీ ఖాన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అక్టోబర్ 20న ఆర్యన్ బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. ఈ నేపథ్యంలోనే అతడు దీపావళికి ముందే జైలు నుంచి బయటకు వస్తాడని ఆశిస్తున్నారు.
ఈద్, దీపావళీ వంటి పండగల వేళ కాంతులీనుతూ ఉండే షారుక్ ఖాన్ ఇల్లు.. మన్నత్ (Mannat House News) ప్రస్తుతం వెలవెలబోయింది. మన్నత్ లోపల పరిస్థితి చాలా దిగులుగా ఉందని షారుక్‌కు దగ్గరి వ్యక్తులు చెప్పారు. షారుక్, గౌరీ దంపతులు వేడుకలు చేసుకునే మూడ్‌లో ఏమాత్రం లేరని తెలుస్తోంది.
అప్పటివరకు స్వీట్లు వద్దు..
నవరాత్రి వేళ కుమారుడు ఆర్యన్ కోసం గౌరీ (Gauri Khan Latest News) ఉపవాసాలు, పూజలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఆర్యన్ రిలీజ్ అయ్యేంతవరకు మన్నత్‌లో స్వీట్లు చేయకూడదని సిబ్బందికి ఆదేశించారట గౌరీ. భోజనంలో భాగంగా వంట సిబ్బంది పాయసం చేయడాన్ని గమనించిన గౌరీ ఈ మేరకు స్పష్టంచేశారని సమాచారం.
ఇలా అరెస్టయ్యాడు..
అక్టోబర్ 3న గోవాకు చెందిన క్రూజ్ నౌకలో(Mumbai Rave Party) ఎన్సీబీ అధికారులు జరిపిన దాడుల్లో ఆర్యన్ ఖాన్, మూన్‌మూన్ ధామేచ, అర్బాజ్ మెర్చంట్ సహా ఎనిమిది మంది అరెస్ట్ అయ్యారు. వీరిని ఇటీవల కోర్టులో హాజరు పరచగా.. తదుపరి దర్యాప్తు నిమిత్తం న్యాయస్థానం వారిని ఎన్సీబీకి అప్పగించింది. అప్పటి నుంచి వీరు జైలులోనే ఉన్నారు.
ఇదీ చూడండి:పేదల కోసం పని చేస్తా... చెడు మార్గంలో వెళ్లను..!