నీ నవ్వు మల్లెపువ్వు.. పెదాలు గులాబీ రేకులు.. కళ్లు కలువ పూలు.. బుగ్గలు బంతి పూలు.. అంటూ చాలా మంది అమ్మాయిలను పూలతో పోలుస్తుంటారు. కానీ ఆ పువ్వులనే అమ్మాయిలతో పోల్చడం ఎప్పుడైనా విన్నారా! ఆ అదృష్టం దక్కించుకుంది ఎవరో కాదు మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్య రాయ్. నెదర్లాండ్స్ దేశం తులిప్ పుష్పాలకు ఐశ్వర్య రాయ్ పేరును పెట్టింది.
సినీడైరీ: పుష్పాలకు ఐశ్వర్య రాయ్ పేరు..! - flowers
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ పేరును తులిప్ పుష్పాలకు పెట్టింది నెదర్లాండ్స్. అందం, అభినయంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఐశ్వర్యను ఈ గౌరవంతో సత్కరించింది.
ఐశ్వర్య
నెదర్లాండ్స్ ప్రభుత్వం 2005లో అధికారికంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. తన అందంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది ఐశ్వర్య. బాలీవుడ్లో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా ఐశ్వర్య రాయ్కున్న స్థానం మాత్రం ప్రత్యేకం.
ఇది చదవండి: తండ్రి సినిమా షూటింగ్లో కొడుకు సందడి