తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నిశ్శబ్దం'గా ఉండమంటున్న అనుష్క చేతులు - first-look-of-anushkas-nishabdam

అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'నిశ్శబ్ధం'. ఈ సినిమా టైటిల్ లోగోను విడుదల చేసింది చిత్రబృందం.

సినిమా

By

Published : Jul 20, 2019, 10:52 PM IST

Updated : Jul 21, 2019, 7:55 AM IST

లేడీ సూపర్ స్టార్ అనుష్క నటిస్తున్న తాజా చిత్రం 'నిశ్శబ్ధం'. మాధవన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. సినీ పరిశ్రమలో స్వీటీ అడుగుపెట్టి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మూవీ టైటిల్ పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

ఇందులో అనుష్క చేతులు సైన్ లాంగ్వేజ్​లో నిశబ్దంగా ఉండమని చెబుతున్నట్లు ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్​గా తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపీ సుందర్ సంగీత దర్శకుడు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది.

నిశ్శబ్ధం పోస్టర్

హాలీవుడ్ ప్రముఖ నటుడు మైఖేల్ మ్యాడ్​సన్, అంజలి, షాలినీ పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చాలా కాలం తర్వాత అనుష్క ఈ చిత్రం చేస్తోంది. అందుకే ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

ఇవీ చూడండి. వర్మ ట్రిపుల్​ రైడింగ్​.. పోలీసుల జరిమానా

Last Updated : Jul 21, 2019, 7:55 AM IST

ABOUT THE AUTHOR

...view details